ETV Bharat / bharat

కేంద్రం తీరుపై దిల్లీలో సీఎం నిరసన

author img

By

Published : Nov 4, 2020, 2:46 PM IST

పంజాబ్​ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎంతో సహా ఎమ్మెల్యేలు.. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్​ సంక్షోభం నెలకొందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

Punjab
అమరీందర్ సింగ్​

అన్ని విష‌యాల్లో పంజాబ్‌పై కేంద్రం వివ‌క్ష చూపుతోందని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద పంజాబ్​ సీఎం అమరీందర్ సింగ్​తో కలిసి నిరసన చేపట్టారు. విద్యుత్​ సమస్య పరిష్కారానికి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి పట్టించుకోవటం లేదని ఆరోపించారు అమరీందర్.

నిరసనలో భాగంగా పంజాబ్​ ఎమ్మెల్యేలు.. బుధ‌వారం ఉద‌యం దిల్లీలోని పంజాబ్ భ‌వ‌న్ నుంచి జంత‌ర్‌మంత‌ర్ వ‌ర‌కు కాలినడ‌క‌న వెళ్లారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

  • ##WATCH | Delhi: Punjab MLAs march to Jantar Mantar from Punjab Bhawan to stage a protest.

    As per Punjab CMO, the demonstration will 'highlight the state’s power crisis & critical essential supplies situation amid Centre’s refusal to allow movement of goods trains' pic.twitter.com/bp4t3aLJns

    — ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పంజాబ్​లో రైతుల నిరసనల నేపథ్యంలో గూడ్స్ రైళ్లను నిలిపేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అనుమతించకపోవటంపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బొగ్గు, యూరియా, డీఏపీ నిండుకున్నాయని.. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

వ్యవసాయ చట్టాలపై..

సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్​లో నిరననలు కొనసాగుతున్నాయి. పటియాలాలోని రాజ్​పుర థర్మల్ విద్యుత్​ కేంద్రం వద్ద రైల్వే పట్టాలపై రైతులు ఆందోళన చేపట్టారు. పటియాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 32 చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. పంజాబ్​లో రైతుల నిరసనల కారణంగా రూ.1,200 కోట్ల నష్టం రైల్వే శాఖ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.