ETV Bharat / bharat

'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం

author img

By

Published : Dec 18, 2021, 12:28 PM IST

Updated : Dec 18, 2021, 1:30 PM IST

Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. అధునాతన ఫీచర్లతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

Agni Prime missile
అగ్ని ప్రైమ్

Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి శనివారం ఉదయం చేపట్టిన ఈ వ్యూహాత్మక క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి చేరుకుందని డీఆర్​డీఓ ప్రకటించింది.

'అగ్ని-పి' అనేది అగ్ని సిరీస్​ క్షిపణుల్లో అధునికీకరించిన వెర్షన్​. 1,000, 2,000 కి.మీల మధ్య శ్రేణి సామర్థ్యంతో దీనిని రూపొందించారు.

మరోవైపు.. క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్​డీఓను అభినందించారు. 'క్షిపణి వ్యవస్థ అద్భుతమైన పనితీరు ఎంతో సంతోషకరమని' పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.