ETV Bharat / bharat

నిద్రిస్తున్న బాలికపై యాసిడ్​ దాడి- ప్రేమే కారణమా?

author img

By

Published : Aug 30, 2021, 11:36 AM IST

ఇంటి ముందు నిద్రిస్తున్న బాలికపై యాసిడ్​ దాడికి(acid attack) పాల్పడ్డాడు దుండగుడు. బాధితురాలితో పాటు ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో జరిగింది.

acid attack
బాలికపై యాసిడ్​ దాడి

తను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమవటాన్ని తట్టుకోలేని ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఇంటి ముందు నిద్రిస్తున్న బాలికపై యాసిడ్​ దాడి(acid attack) చేశాడు. ఈ ఘటనలో బాలికతో పాటు ఆమె చిన్న తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో జరిగింది.

ఇదీ జరిగింది...

జిల్లాలోని సికందర్​పుర్​ గ్రామానికి చెందిన ఓ బాలిక(16), తన చిన్న తమ్ముడితో కలిసి ఆదివారం రాత్రి ఇంటి ముందు మంచంపై నిద్రిస్తోంది. అర్ధరాత్రి వారిపై యాసిడ్​ దాడి జరిగింది. తీవ్ర గాయాలతో అరవగా.. కుటుంబ సభ్యులు లేచి వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లఖ్​నవూకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి వస్తువులను దొంగతనం చేశారని, తిరిగి వెళ్తున్న క్రమంలో వాళ్లపై యాసిడ్​ దాడి చేసి పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన బబ్లూ లోధ్​ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుసుకుని.. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

'నిందితుడు, బాధితురాలి మధ్య పరిచయం ఉంది, కొద్ది రోజుల్లో బాలిక వివాహం ఉందని తెలుసుకున్న బబ్లూ కోపం పెంచుకున్నాడు. బాధితురాలి తండ్రిని చంపుతానని బెదిరించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి నిందితుడిని అరెస్ట్​ చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది' అని జిల్లా ఎస్పీ శ్లోక కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: బాలికపై యాసిడ్​ దాడి.. పరిస్థితి విషమం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.