ETV Bharat / bharat

శునకాన్ని బైక్​​పై ఈడ్చుకెళ్లి చిత్రహింసలు

author img

By

Published : Apr 23, 2021, 10:29 AM IST

మూగజీవాలు తమను ఏమీ చేయలేవని కొందరు వ్యక్తులు వాటిపట్ల ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరు వద్ద ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి కుక్కను లాక్కెళ్లిన వీడియో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Mangalore dog dragged on road
కుక్కను లాక్కెళ్తున్న దృశ్యం

కుక్కను లాక్కెళ్తున్న దృశ్యం

కేరళలో కుక్కను బైక్​కు కట్టి అమానుషంగా ఈడ్చుకెళ్లిన ఘటన మరవక ముందే.. కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. మంగుళూరులో ఓ శునకానికి తాడు కట్టి ద్విచక్రవాహనంపై వేగంగా లాక్కెళ్లిన వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. ఈ ఉదంతాన్ని హైవేపై ప్రయాణిస్తున్న వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

తాగిన మైకంలో పైశాచిక ఆనందం పొందుతున్న వీరి తీరు పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటువంటి వారి ఆగడాలకు మూగజీవాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై జాతీయ పర్యావరణ పరిరక్షణ సమితి కర్ణాటక ప్రధాన కార్యదర్శి హెచ్.శశిధర్ షెట్టి సూరత్కల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి: బావిలో జింక- చాకచక్యంగా కాపాడిన అటవీ సిబ్బంది

శునకానందం: బైక్​కు కట్టి.. చిత్రహింసలు పెట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.