ETV Bharat / bharat

మైనర్​పై 80ఏళ్ల వృద్ధుడి 'డిజిటల్​ రేప్​'- అసలేంటీ కొత్త కేసు?

author img

By

Published : May 16, 2022, 9:38 AM IST

Man Arrested In Digital Rape Case: ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో డిజిటల్ రేప్ కేసు నమోదైంది. 80 ఏళ్ల వృద్ధుడు 7 ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి అరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు డిజిటల్ రేప్​ అంటే ఏంటి?

Man Arrested In Digital Rape Case
నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Digital Rape Case: ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో డిజిటల్​ రేప్​ కేసు వెలుగుచూసింది. 80 ఏళ్ల వృద్ధుడు తనను 7 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడి పేరు మౌరిస్​ రైడర్. పెయింటర్​గా పనిచేస్తున్నాడు. అలహాబాద్​కు చెందిన ఇతడు నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను పెట్టుకున్నారు. ఏడేళ్లుగా ఆమె ఇక్కడే పనిచేస్తోంది.

Digital rape news: అయితే మౌరిస్ రైడర్​.. తనను పనిలో చేరినప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డుల రూపంలో అందజేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై సెక్షన్​ 376, 323, 506తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిజిటల్ రేప్ అభియోగాలు మోపారు.

Man Arrested In Digital Rape Case
నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ఇప్పుడు డిజిటల్ రేప్​ అంటే ఏంటి? అనే చర్చ మొదలైంది. డిజిటల్​ అంటే ఇంటర్నెట్​తో ఏమైనా సంబంధం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే డిజిటల్​, రేప్​ రెండు వేర్వేరు పదాలు. డిజిట్​ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్​ రేప్​ అని పేరు పెట్టారు. డిజిటల్​ రేప్​ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వెేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం.

Noida Digitial Rape: ఈ తరహా కేసు భారత్​లో నమోదవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఓ పాఠశాల బాలిక బస్సులో ఇంటికి తిరిగివెళ్తుండగా.. కండక్టర్​ అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. ఆ చిన్నారి ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు కండక్టర్​ను అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి చిన్నారుల భద్రత కోసం డిజిటల్​ రేప్​పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి: బిహార్​లో బాల్యవివాహం.. మాకేం తెలీదన్న పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.