ETV Bharat / bharat

అసోంలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి

author img

By

Published : Dec 28, 2020, 3:29 PM IST

అసోంలో బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్​.

6 killed in bus-truck collision in Assam
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

అసోం కోక్రాఝార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

సపత్​గ్రామ్​ నుంచి ధుబ్రి వెళ్తున్న బస్సు 17వ నంబరు జాతీయ రహదారిపై చటగురి ప్రాంతం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో సందేశ్​ ఆలీ, సత్తార్​ ఆలీ, రఫిక్​ ఇస్లాం, బసిదుల్​ ఇస్లాం, సదర్​ కాజీని గుర్తించిన అధికారులు.. ఇంకో వ్యక్తి ఎవరనేది తెలియలేదని తెలిపారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్ట్ర సీఎం సర్భానంద సోనోవాల్.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: 'హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య రెట్టింపు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.