ETV Bharat / bharat

చెత్త ఏరుకొనే వ్యక్తికి దొరికిన బ్యాగ్- తెరిచి చూస్తే 23 లక్షల అమెరికన్ డాలర్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 3:00 PM IST

23 Lakhs Us Dollars Bag On Near Railway Track : ఎప్పటిలాగానే చెత్తను ఏరుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి అనుకోకుండా ఒక బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే సుమారు 23 లక్షల అమెరికన్​ డాలర్లు ఉన్నాయి. అంత డబ్బుతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

23 Lakhs Us Dollars Bag On Near Railway Track

23 Lakhs Us Dollars Bag On Near Railway Track : బెంగళూరులో చెత్త ఏరుకునే ఓ వ్యక్తికి 23 లక్షల అమెరికన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.20 కోట్లు) ఉన్న ఓ బ్యాగ్​ దొరికింది. దీంతో షాక్ అయిన అతడు.. ఏం చేయాలో తెలియక వేరే వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఆ డాలర్లను పరిశీలించిన పోలీసులు అవి నకిలీ నోట్లు అని గుర్తించారు.

బంగాల్​కు చెందిన సాల్మాన్(39) అనే వ్యక్తి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నవంబర్​ 3న బెంగళూరులోని వీరనాయపాళ్యం రైల్వే గేటు సమీపంలో చెత్తను ఏరుకుంటున్నాడు. ఆ సమయంలో నల్లబ్యాగ్​ ఒకటి కనిపిచింది. తెరిచి చూస్తే.. బ్యాగ్​ నిండా అమెరికన్​ డాలర్లు ఉన్నాయి. ఒక్కసారిగా అంతా డబ్బును చూసే సరికి సాల్మాన్ షాక్ అయ్యాడు.

దీంతో భారీ మొత్తంలో డాలర్లు నోట్లు కనిపించే సరికి ఏమి చేయాలో తేలిక తనుకు తెలిసిన ఓ​ వ్యాపారికి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే ఆ వ్యాపారి తాను ప్రస్తుతం బెంగళూరులో లేనని, వచ్చే వరకు ఆ డబ్బును తన దగ్గరే ఉంచుకోవాలని చెప్పాడు. ఆ బ్యాగ్​ను సాల్మాన్ తనుకు తెలిసిన వాళ్ల ఇంటిలో ఉంచాడు. ఇంకా తన దగ్గర ఇంత డబ్బు ఉండటం మంచిది కాదని అనుకున్న సాల్మాన్​.. రెండు రోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సంస్థలో గుర్తింపు పొందిన సామాజిక కార్యకర్త ఆర్ కలీం ఉల్లాకు ఈ విషయాన్ని చెప్పాడు.

కలీం ఉల్లా.. ఈ సంగతిని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్​ దయానంద్​ను తెలిపారు. సాల్మాన్​ను పిలిచి పోలీసులు ప్రశ్నించారు. అనంతరం అతని దగ్గర ఉన్న డాలర్లను తీసుకొని.. వాటిని తనిఖీ చేయాలని హెబ్బాల్ పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ను ఆదేశించారు. డబ్బును పరిశీలించగా అవన్నీ నకిలీ నోట్లు అని గుర్తించారు. బ్యాగ్​లో మొత్తం 23 లక్షల అమెరికన్​ డాలర్లు ఉన్నాయని, అలానే ఐక్యరాజ్య సమితి ముద్రతో ఒక సీల్డ్ కవర్ ఉన్నట్లు తెలిపారు. నకిలీ నోట్లపై స్పష్టత కోసం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఎవరైనా డబ్బులు వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నామని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు

Fake Currency Gang: 'ఫర్జీ' సీన్ రిపీట్.. ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.