PRATHIDWANI : ఆధార్ సమాచారం అక్రమార్కుల చేతుల్లో పడితే ఏం జరుగుతుంది?
PRATHIDWANI : మన దేశంలో పౌరుల వ్యక్తిగత గుర్తింపును ధృవీకరించే సార్వత్రిక కార్డు ఆధార్. పేరు, చిరునామా, గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్, బార్ కోడ్ కలిగి ఉండే ఈ కార్డును విచక్షణతో ఉపయోగించాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. దీంతో ఆధార్ భద్రతపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆధార్ కార్డుతో ప్రభుత్వం వ్యక్తుల గోప్యతను ప్రమాదంలో పడేసిందన్న విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఆధార్ సమాచారం అక్రమార్కుల చేతుల్లో పడితే ఏం జరుగుతుంది? ఏయే అవసరాలకు ఆధార్ సమాచారం ఉపయోగించుకోవచ్చు? ఎవరెవరితో ఆధార్ నెంబర్ను నిరభ్యంతరంగా పంచుకోవచ్చు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.