MP Madhavi Video: వరి కుప్ప నూర్పులో.. బిజీబిజీగా ఎంపీ మాధవి దంపతులు

By

Published : Dec 31, 2021, 8:52 PM IST

thumbnail

ఆమె ఓ ఎంపీ..! నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్​ వేదికగా గళాన్ని వినిపించే ప్రతినిధి! అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే.. అధికారుల హడావిడి, స్థానిక పోలీసుల బందోబస్తు సర్వసాధారణమే! కానీ.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రూటే సెపరేటు! ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆ ఎంపీ దంపతులు.. తాము నమ్ముకున్న వ్యవసాయాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు! ఎంపీగా ఓ వైపు బిజీగా ఉంటూనే.. సమయం దొరికిన వేళల్లో వ్యవసాయం పనుల్లో నిమగ్నమైపోతున్నారు. తాజాగా.. వారి స్వగ్రామమైన పాడేరు పరిధిలోని శరభన్నపాలెంలో వరినూర్పు పనిలో బిజీబిజీగా కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.