Pratidwani: ఆహార కల్తీని కనిపెట్టేదెలా..? కల్తీ నివారణకు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి..?
ఇందుగలదు అందులేదని సందేహమే వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు కల్తీ..! నేడు సర్వాంతర్యామిగా మారింది కల్తీ! ఆ కల్కీ అవతారమే దిగివ్చచినా... ఈ కల్తీ అంతమయ్యేలా లేదు! ముందు దగా.. వెనుక దగా.. కుడిఎడమల దగాదగా అని.. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు.. ఎక్కడ చూసినా ప్రజలను కల్తీ కాటేస్తోంది. మరి, అడ్డుఅదుపూ లేకుండా సాగుతున్న ఆహార కల్తీని కనిపెట్టేదెలా? మోసాలను గుర్తించి నివారించే వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి? ఈ కల్తీ ఆటకట్టించేందుకు ప్రజల్లో చైతన్యం నింపాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఈ రోజు "ప్రతిధ్వని".