వరుస మరిచిన వైఎస్సార్​సీపీ ఎంపీటీసీ - బాబాయ్​ అని పిలిచే అంగన్​వాడీతో అసభ్య ప్రవర్తన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 12:46 PM IST

thumbnail

YSRCP MPTC Sexual Harrassment On Anganwadi in East Godavari district : వైఎస్సార్​సీపీ ఎంపీటీసీ, వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. జి. దొంతమూరు ఎంపీటీసీ గోలి వెంకటకృష్ణపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డితో కలిసి ఆందోళన చేయడంతో దిశ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారని బాధితురాలు వివరించారు.

TDP Leaders Protest For Support Anganwadi : ఎస్సై పి.విజయ్‌కుమార్‌, వైఎస్సార్​సీపీ  జడ్పీటీసీ సభ్యుడు పి.రాంబాబు, సర్పంచి గోలి రమణ నిందితునికి అండగా నిలిచారన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు దిశ చట్టం కింద ఫిర్యాదు చేశానని, సమస్య ఎస్పీ వరకు వెళ్లడంతో కేసు నమోదైందని వివరించారు. టీడీపీ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల గోవింద్‌ బాధితురాలికి మద్ధతుగా నిలిచారు. వైఎస్సార్​సీపీ ఎంపీటీసీ డబ్బులిచ్చి బాధితురాలి నోరు నొక్కే ప్రయత్నాలు చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మార్తమ్మ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.