భయపడిందే జరిగింది - దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ నేత వర్గీయుల దాడి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Nov 5, 2023, 1:09 PM IST

thumbnail

YSRCP Followers Attack On Dalith Woman: అధికార వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ వర్గీయులు అధికార అహంతో చేస్తున్న చర్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎన్టీఆర్​ జిల్లాలో ఓ వైసీపీ నాయకుడి వర్గీయులు దళిత మహిళతోపాటు, ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ దాడిలో మహిళతో పాటు అతని కుమారుడు గాయపడగా.. నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన నిప్పులపల్లి కోటేశ్వరరావు.. గతంలో వైసీపీ ముఖ్య నాయకుడైన కోటేరు ముత్తారెడ్డి వద్ద పని చేసేవాడు. అయితే ఈ క్రమంలో ముత్తారెడ్డి తనను అకారణంగా కులం పేరుతో దూషిస్తుండే వాడని.. కోటేశ్వర రావు అట్రాసిటీ కేసు పెట్టాడు. అంతేకాకుండా ముత్తారెడ్డి పని చేసినందుకు వేతనం కూడా చెల్లించేవాడు కాదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక వైసీపీ నాయకులు చొరవ తీసుకుని కోటేశ్వరరావుకు, ముత్తారెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో ముత్తారెడ్డి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణ హాని ఉందని కోటేశ్వర రావు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టాడు. ఈ వీడియోలు పోస్టు చేసిన కొద్ది రోజులకే అతని తల్లి, సోదరుడిపై శనివారం రాత్రి దాడి జరిగింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.