'మనుషులను నరికి జైలుకుపోయివచ్చినా' - స్థలం కబ్జాను అడ్డుకున్న మహిళల్ని బెదిరించిన ఎమ్మెల్యే పీఏ
YCP MLA PA Brutalized Womens by Occupying Land: తమ స్తలం కబ్జా చేసి కంచే నిర్మిస్తుంటే అడ్డుకున్న మహిళలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వద్ద పీఏగా ఉన్న శివ దౌర్జన్యానికి దిగిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సార్బీసీ (SRBC) ప్రధాన కాలువ సమీపంలోని సర్వే నంబర్ 137లో ఉన్న ఐదు సెంట్ల స్థలాన్ని.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పీఏ శివ కబ్జా చేసి కంచే వేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఆ స్థలం గతంలో తామ కొనుగోలు చేశామని ఇద్దరు మహిళలు అడ్డుకున్నారు. అడ్డోచ్చిన మహిళలను శివ దుర్బాషలాడుతు బెదిరించారు.
స్థానిక వ్యక్తి అడ్డుకోగా అతనిపై శివ దురుసుగా ప్రవరిస్తూ దాడికి దిగారు. పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారని మహిళలు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈటీవీ భారత్ ప్రతినిధి తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆక్రమణకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ వెల్లడించారు.