YCP Delegates Meeting in Vijayawada: ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 9:59 AM IST

thumbnail

YCP Delegates Meeting in Vijayawada: సాధారణ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా విజయవాడలో నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. వైఎస్ఆర్సీపీ సమర భేరి పేరిట అధికారపార్టీ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సభను నిర్వహిస్తోంది. సమావేశానికి 8 వేల మంది పార్టీ నేతలను ఆహ్వానించింది. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ అధ్యక్ష హోదాలో సమావేశంలో పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. "వై ఎపీ నీడ్స్ సీఎం వైఎస్ జగన్ " (Why AP Needs Jagan) పేరిట కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టనుంది. ఇప్పటికే కార్యక్రమ విధివిధానాలు, కార్యాచరణపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో వారికి ధీటుగా సమాధానం ఇచ్చే విషయంపైనా శ్రేణులకు సీఎం పలు సూచనలు చేస్తారని సమచారం. సీఎం దిల్లీ నుంచి వచ్చాక జరుగుతోన్న కీలక సమావేశం కావడంతో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.