YCP Activist Srinivas on MLA Attack: 'నాపైనే పోస్ట్ పెడతావా.. చంపి డోర్ డెలివరీ చేస్తా..' వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 6:50 PM IST

Updated : Sep 1, 2023, 6:35 AM IST

thumbnail

YCP Activist Srinivas on MLA Attack: "పాపం పండింది".. అనే పోస్టును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వైసీపీ కార్యకర్తపై.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించిన ఘటన కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల విమర్శలను సైతం ఓర్చుకోలేని పరిస్థితిల్లో వైసీపీ ప్రభుత్వం దమన కాండకు పాల్పడుతోంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డిని బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేసి.. రెండు గంటలపాటు ఎమ్మెల్యే ఇంట్లో చిత్రహింసలు పెట్టారు. బయటికి చెబితే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్​ను చంపి డోర్ డెలివరీ చేసినట్లుగా, ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్త నందం సుబ్బయ్యను హత్య చేసిన రీతిలో తన పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించినట్లు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యకర్తగా ఉన్నందుకు కిడ్నాప్ చేసి చితకబాదారని.. ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి.

Last Updated : Sep 1, 2023, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.