Womens Protest Against Chandrababu Arrest in Vijayawada: 'బాబుతో మేము సైతం'.. విజయవాడలో ధ్వజమెత్తిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 7:13 PM IST

thumbnail

Womens Protest Against Chandrababu Arrest in Vijayawada Benz Circle: స్కిల్‌ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జగన్‌ సైకో పాలనకు నిదర్శనమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెండో రోజూ నిరాహారదీక్షలు చేపట్టారు. బాబును స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. 

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మహిళలు రోడ్డెక్కారు. బాబుతో మేము సైతం అంటూ మహిళా ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజనరీ ఉన్న నేతను జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు. జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలనను తట్టుకోలేకే రోడ్డెక్కామని ఆవేదన వ్యక్తం చేశారు.  బాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.