volunteer belt shop: అటు సచివాలయం.. ఇటు రైతు భరోసా కేంద్రం.. మధ్యలో వాలంటీర్ బెల్ట్ షాప్

By

Published : Jul 25, 2023, 7:36 PM IST

thumbnail

volunteer belt shop: వైసీపీ అధికారంలోకి వచ్చాక బెల్టు షాపులు రద్దు చేశామంటూ సీఎం జగన్‌ మొదలుకుని.. ఆ పార్టీ నాయకుల వరకూ ఊదరగొడుతుంటే ఏలూరు జిల్లాలో ఏకంగా గ్రామ సచివాలయాన్ని ఆనుకునే.. బెల్టు షాపు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఆనుకుని... ఇలా దుకాణంలా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో పరదాలు కట్టి మందుబాబుులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా లోపల కుర్చీలు వేశారు. ఈ బెల్టు దుకాణాన్ని ఓ వాలంటీర్ నాలుగేళ్లుగా నడుపుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా.. మద్యాన్ని వేరేచోట నిల్వ చేశాడు. మందుబాబులు వచ్చి ఏం కావాలో చెప్తే.. బయట నుంచి తెచ్చి అందిస్తున్నాడు. ఇంత బహిరంగంగా బెల్టు షాపు, మద్యం సిట్టింగ్ సౌకర్యాలు కల్పిస్తుంటే పోలీసులకు గానీ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలకు గానీ కనిపించడం లేదు. గ్రామ సచివాలయానికి వచ్చివెళ్లే పౌరులు మాత్రం.. ప్రభుత్వ కార్యాలయం పక్కనే ఇదేం దందా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.