Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశేషం.. ఈ సారి రెండుసార్లు ఉత్సవాలు

By

Published : Aug 1, 2023, 12:04 PM IST

thumbnail

Tirumala Srivari Brahmotsavam starts from September 18 : ఈ ఏడాది అధికమాసం సందర్భంగా తిరుమలలో శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నమయ్య భవనంలో స్వామివారికి జరిగే వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 18 నుంచి 26వ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 18న ధ్వజారోహణం అనంతరం అదేరోజున సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. సెప్టెంబరు 22న గరుఢసేవ, 23న స్వర్ణరథం, 25 మహారథోత్సవం, 26న  చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నారు. అక్టోబర్‌ 14 నుంచి 23వ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ధర్మారెడ్డి  వెల్లడించారు. అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమిళులు అత్యంత  ఇష్టంగా భావించే పెరటాసి మాసం బ్రహ్మోత్సవాల సమయంలో వస్తోందన్నారు. అశేష సంఖ్యలో భక్తుల రద్దీ రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు రద్దు చేస్తున్నామని, స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.