TNSF Fire On Governament MCET 3rd Counseling : ఎంసెట్ కౌన్సెలింగ్.. మూడో విడత చేపట్టాలంటూ టీ​ఎన్​ఎస్ఎఫ్​ ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 12:52 PM IST

thumbnail

TNSF Fire On Governament In The Issue Of MCET 3rd Counseling:  రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉన్నత విద్యా చైర్మన్ కార్యాలయం వద్ద టీ​ఎన్​ఎస్ఎఫ్​ TNSF( తెలుగు నాడు స్టూడెంట్స్​​ ఫెడరేషన్​)  నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఎంసెట్ 3వ విడుత కౌన్సెలింగ్‌ను తక్షణమే చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా చైర్మన్ హేమచంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Students Protest At Higher Education Office : ఇప్పటి వరకు ఏటా 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది అర్ధాంతరంగా రెండు కౌన్సెలింగ్‌లకే పరిమితం చేయడం బాధాకరమన్నారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ పరీక్ష రాస్తుంటారని విద్యార్థులు గుర్తు చేశారు. గతంలో ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారని ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.