Tiger Migration in Srikakulam District: అమ్మో పెద్దపులి..! రెండురోజులుగా సంచారం... అప్రమత్తమైన అటవీ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 6:25 PM IST

thumbnail

Tiger Migration in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నిన్న కంచిలి మండలం పరిధిలోని అమ్మవారి పుట్టుగ, బంజీరి నారాయణపురం, మండపల్లి గ్రామాల్లో సంచరించి.. ఈ రోజు కవిటి మండలంలోకి ప్రవేశించింది. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు (Locals Panic over Tiger Migration) గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు(Forest officials)... ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. 

ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. వాటి అడుగుల ముద్రలనుబట్టి అవి పెద్దపులివిగా(Tiger Migration)  గుర్తించారు. గత రెండు రోజులుగా ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి కంచిలి, కవిటి తదితర మండలాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్ర తీర ప్రాంతమైన మొగలి తోటల్లో పెద్దపులి(Tiger Halchal) తిష్ట వేసినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.