NTR centenary celebrations: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. జగన్‌పై టీడీపీ నేతల సంచలన వ్యాఖ్యలు

By

Published : May 22, 2023, 10:48 PM IST

thumbnail

NTR centenary celebrations in Kakinada updates: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారి శత జయంతి వేడుకులను ఆ పార్టీ నాయకులు కాకినాడలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా నలువైపులా నుంచి పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు తరలివచ్చారు. అనంతరం రాజకీయంగా, సామాజికంగా విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. 

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలో 'తెలుగువారి ఆత్మగౌరవానికి (NTR 100) వందేళ్లు' అనే పేరుతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పార్టీ నియమాలను తూ.చ. తప్పకుండా అనుసరిస్తామని ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పాదయాత్ర చేసి అబద్ధపు హామీలతో జగన్‌ అధికారంలోకి వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని అడ్డంపెట్టుకుని సీఎం జగన్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. 151 సీట్లు రావడంతో జగన్‌కు కళ్ళు మూసుకుపోయాయన్నారు. టీడీపీ వైసీపీలా గాలికి పుట్టలేదన్నారు. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీకి ఏంటి ఈ కష్టాలు అని భయపడ్డామని, కానీ, ఇవాళ 160 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు బయటకి రాకపోయినా కార్యకర్తలు వచ్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

''రాష్ట్రానికీ రాజధాని ఉండాలని అమరావతిని అభివృద్ధి చేస్తే దాన్ని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర రాజదాని అని చెప్పి రూ.30వేల కోట్ల భూములు ఆక్రమించారు. ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నవారు. అమరావతీ రైతులు ఎన్నో బాధలు పడుతున్నారు. అమరావతిలో 5వేలు ఇళ్లు కట్టాం. ఐదేళ్లయినా జగన్ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మళ్ళీ సెంటు భూమి అని దగా చేస్తున్నాడు. స్వతంత్ర భారతంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఛీ కొడుతున్న వ్యక్తి జగన్.'' అని టీడీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చేరిగారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.