MLC Ashok Babu Letter to EC on Volunteers: వైసీపీకి వాలంటీర్లు ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు.. ఈసీకి ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫిర్యాదు

By

Published : Aug 17, 2023, 9:17 PM IST

thumbnail

TDP MLC Ashok Babu Letter to Election Commissioner: గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్​కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు ఫిర్యాదు చేసారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లు ఎన్నికల సంఘం అధేశాలను భేఖాతరు చేస్తున్నారని తెలిపారు. మడకశిర నియోజకవర్గంలో వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధులకు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ తరపున వారంతా వీధుల్లో తిరుగుతూ.. వైసీపీ నాయకులకు ప్రచారకర్తలుగా.. వైసీపీకీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వార్డు నంబర్​ 2 లో వాలంటీర్లు హర్ష, నాగరాజు, ఎం ఎస్ గౌరమ్మలు పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా అంగలి మండలం గరం గ్రామంలో వైసీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్న వాలంటీర్ల పొటోలను లేఖకు జత చేసారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నా.. వాలంటీర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేసిన వాలంటీర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.