ఓటర్ల జాబితాపై అధికార యంత్రాంగం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది - టీడీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 3:44 PM IST

Updated : Nov 28, 2023, 3:52 PM IST

thumbnail

TDP Leaders Complaint to Collector: జగన్ సర్కార్ జరగబోయే ఎన్నికల ఓటమి భయంతో టీడీపీ(TDP) సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తోందని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. అనర్హుల పేర్లు ఓట్ల జాబితా(Uneligible Names from voter list) నుంచి తొలగించాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఫామ్7(form7) నింపాలని చెప్పిన అధికారులు.. వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై స్పందిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. జిల్లా కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు. 

Deletion of Uneligible Names from Voter List Showing Dual Nature by Officers: వైసీపీ(YCP) నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో(Rafthadu Constituency) బోగస్ ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని అధికారులు.. ఉరవకొండలో ఏడు వేల ఓట్లు తొలగించాలని వైసీపీ నాయకులు ఇచ్చిన ఒక్క అభ్యర్థనతో ఎలా చర్యలు తీసుకుంటారని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఓటర్లందరూ కనీసం వారానికోసారి ఓట్ల జాబితాలో మీ పేరు ఉందోలేదో పరిశీలించుకోవాలని కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ గెలవటం అసాధ్యమని.. అభద్రతా భావం పెరిగిపోవటం వల్లే ఓటర్ల జాబితాలో అవకతవకలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.

Last Updated : Nov 28, 2023, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.