TDP Leader Atchannaidu on Chandrababu బాబు క్వాష్​పై సాంకేతిక ఇబ్బందులనే కోర్టు ప్రస్తావించింది ! న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: అచ్చెన్నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 6:37 PM IST

thumbnail

TDP State President Achchennaidu on Chandrababu Cash Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు తీర్పుపై.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. న్యాయస్థానాల మీద తమకు గౌరవం ఉందని, త్వరలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు విడుదలవుతారని అన్నారు.

Achchennaidu Comments: టీడీపీ పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..''తెలుగుదేశం పార్టీలో ప్రతీ కార్యకర్త ఓ నాయకుడే. ప్రతీ నాయకుడు ఓ చంద్రబాబే. చంద్రబాబుని అరెస్టు చేస్తే..వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించవచ్చనే పిచ్చి భ్రమలో జగన్ ఉన్నాడు. పార్టీ తరఫున రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. గ్రామాల్లో ప్రతీ గడపా తట్టి, జగన్ అక్రమాలు వివరిస్తూ.. బాబుతో నేను కార్యక్రమం కొనసాగిస్తాం. ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన సీఐడీ, చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టాలనే కస్టడీ కోరింది. స్కిల్ కేసుపై క్వాష్ చేయటానికి సాంకేతిక ఇబ్బందులు న్యాయస్థానం ప్రస్తావించింది. కానీ, కేసుపై ఎలాంటి కామెంట్ చేయలేదు. న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచించి, అందుకనుగుణంగా వెళ్తున్నాం. హైకోర్టు తీర్పులో చంద్రబాబు ఎక్కడా అవినీతికి పాల్పడ్డారని చెప్పలేదు. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని మాత్రమే హైకోర్టు చెప్పింది. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. టీడీపీకి బలం కార్యకర్తలే. ఎక్కడ కూడా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోలేదు.'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.