Suicide Attempt in Front of Police Station: పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. బ్లేడుతో గొంతుకోసుకుని..
Suicide Attempt in Front of Police Station: బాపట్ల జిల్లాలోని చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈపురుపాలెేనికి చెందిన వెంకటేశ్వర్లు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండగా.. ఇటీవల ఓ కేసులో బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాల్సి ఉండగా.. పలు కేసులపై అతడిని పోలీసులు విచారించినట్లు సీఐ మల్లిఖార్జున తెలిపారు. ఈ క్రమంలో అతడిని కోర్టు ఆర్డరు తీసుకుని రమ్మని చెప్పి.. కొద్ది సేపు వరండాలో కూర్చోమని సూచించామన్నారు. సీఐ గది నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు.. తనతోపాటు తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడని సీఐ తెలిపారు. వెంటనే చికిత్స మేరకు అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. కాగా.. పాత కేసుల నుంచి తప్పించుకునేందుకు, పోలీసులను బెదిరించేందుకు అతడు ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.