Student Union Protest on Visakha Ukku in Nellore : విశాఖ స్టీల్ పరిరక్షణ, కడప ఉక్కు పరిశ్రమ సాధనకై... నవంబర్ 8న రాష్ట్ర బంద్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 7:53 PM IST

thumbnail

Student Union Protest on Visakha Ukku in Nellore : విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు సాధన కోసం వచ్చే నెల 8న రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రకటించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన నిరసనలు నవంబర్8 నాటికి వెయ్యి రోజులకు చేరడంతో, ఆ రోజు బంద్​కు పిలుపునిస్తున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ ప్రకటించారు. నెల్లూరు నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్, పీడీఎస్​యూ, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా యువత తీవ్రంగా నష్టపోతోందని ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Student And Youth Organizations Fires on YCP Government 2023 : ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రయత్నించటం దారుణమన్నారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినా కడప ఉక్కు పరిశ్రమను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు, కడప ఉక్కు పరిశ్రమల సాధన కోసం వచ్చే నెల 8న చేపట్టనున్న బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.