Sri Lankan Minister in Vijayawada రాష్ట్రంలో సేవారంగం విస్తరణ.. ఏపీతో విడదీయలేని అనుబంధం: శ్రీలంక మంత్రి

By

Published : Aug 13, 2023, 7:19 PM IST

Updated : Aug 13, 2023, 7:48 PM IST

thumbnail

Sri Lankan Minister in Vijayawada: ఏపీలో సేవారంగాన్ని విస్తరించేందుకు శ్రీలంక కృషి చేయనుందని ఆ దేశ వాణిజ్య, ఆహార భద్రత శాఖ మంత్రి సత్యశివం వియలాండరాన్ చెప్పారు. ఏపీలో మెడికల్ టూరిజాన్ని విస్తృతం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంక, భారత్ కు... అలాగే శ్రీలంక- ఏపీకి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని సత్యశివం చెప్పారు. విజయవాడ హోటల్ మురళీ ఫార్చ్యూన్​లో డాక్టర్ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ అవర్ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి పాల్గొన్న సత్యశివం... అత్యవసర సమయాల్లో తొలిగంటలో చేపట్టాల్సిన వైద్యచికిత్సలు ఎంతో కీలకమైనవని అభిప్రాయపడ్డారు. గోల్డెన్ అవర్ కార్యక్రమాన్ని శ్రీలంకలో ప్రారంభించాలని ఇక్కడ వైద్యులను ఆయన కోరారు. శ్రీలంకలో ఐటీ సేవలు విస్తృతం కావాలని కోరారు. శ్రీలంకలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేవారిని అహ్వానిస్తున్నట్లు చెప్పారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ. కృష్ణబాబు మాట్లాడుతూ అత్యవసర వైద్యచికిత్సల కోసం త్వరలో జిల్లాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నుంచి నాలుగు జిల్లాల్లో సీసీయూలు ప్రారంభం కానున్నాయని, డిసెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో సీసీయూలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పాముకాటు, ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం వంటి అత్యవసర సమయాల్లో బాధితులకు అండగా ఉండాలన్నదే తమ లక్ష్యమని కృష్ణబాబు చెప్పారు.

Last Updated : Aug 13, 2023, 7:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.