Secretariat Digital Assistant Suspended: ఇంటర్నెట్ సెంటర్‌లో సచివాలయం ధ్రువపత్రాల జారీ.. వాలంటీర్ల ఫిర్యాదుతో ఉద్యోగి సస్పెండ్
Secretariat Digital Assistant Suspended: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే పాడేరు మండలం సలుగు సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ ఈశ్వరమ్మ జగనన్న చేయూత సురక్ష పథకాల ధ్రుపత్రాలు ఆన్లైన్ చేసేవారు. సచివాలయం పరిధిలో నెట్ సదుపాయం లేదని సచివాలయంలో ఇచ్చే ధ్రువపత్రాలను ఆమె భర్త నెట్ సెంటర్‌లో ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దానితో పాటు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ కూడా అక్కడే ఇవ్వడంతో గ్రామ వాలంటీర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో లాగిన్ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర నివేదికి ఇవ్వాలని ఐటీడీఏ(ITDA) పీఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ కంప్యూటర్లు ఇతర సామగ్రిని సెక్రెటరీకి అప్పగించారు. ప్రస్తుతం సచివాలయం నిర్మాణంలో ఉంది. అరకొర వసతులతో ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు కావడం వల్ల ప్రైవేట్ నెట్ సెంటర్‌లో ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.