Second Class Student Died Due to Electric Shock : విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి.. ఉపాధ్యాయుల వైఖరిపై గ్రామస్థుల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 7:12 PM IST

thumbnail

Second Class Student Died Due to Electric Shock : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో విద్యుదాఘాతంతో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలిన విద్యార్థిని చికిత్సకు తీసుకెళ్లకుండా ఉపాధ్యాయులు తరగతి గదిలో పడుకోబెట్టారని, ఉపాధ్యాయుల నిర్లక్యమే చిన్నారి మృతికి కారణమంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు. లంకా కార్తీక్(8) చింతలకుంట మండల పరిషత్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో నాడు-నేడు పనుల దృష్ట్యా ప్రైవేట్ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజనం ప్లేట్లు కడిగేందుకు కుళాయి​ వద్దకు విద్యార్థులు వెళ్లారు. ఆ సమయంలో నీళ్లు లేకపోవడంతో సిబ్బంది మోటర్ ఆన్​ చేశారు. విద్యుత్ షాక్​తో విద్యార్థి కార్తీక్ కుప్పకూలిపోయాడు. విద్యార్థిని అధ్యాపకులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తరగతి గదిలో పడుకోబెట్టారు. అధ్యాపకులు విద్యార్థిని వెంటనే చిక్సిత కోసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇలా నిర్లక్యంగా వ్యవహరించినందుకే విద్యార్థి మృతి చెందాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.