అంతరాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద 220 కేజీల గంజాయి స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 4:53 PM IST

thumbnail

SEB Officials Seize 220 KG Ganja : రాష్ట్రంలో గంజాయి రవాణా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట గంజాయి వాసన గుప్పుమంటోంది. తాజాగా ఏలూరు జిల్లాలో అంతరాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో లారీలో 220 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై జంగారెడ్డిగూడెంలో ఏఎస్​పీ సూర్యచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు లారీలో 110 బ్యాగుల్లో 220 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబట్టారని ఆయన తెలిపారు. 110 బ్యాగులను లారీ క్యాబిన్​లో అమర్చి మహారాష్ట్రలోని అహ్మదాబాద్​కు తరలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 22 లక్షలు రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని ఏఎస్​పీ సూర్యచంద్రరావు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.