'మోదీ హఠావో దేశ్‌కీ బచావో' - బీజేపీపై అఖిలపక్ష నేతల ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 9:47 PM IST

thumbnail

Round Table Meet at  Vijayawada: విజయవాడలో ఈనెల 30వ తేదీన 'మోదీ హఠావో దేశ్‌కీ బచావో' నినాదంతో మేథోమథనం సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సీపీఎం, సీపీఐ ఇరత పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో బాలోత్సవ్‌ భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను, ఆదేశ సూత్రాలను బీజేపీ పరిగణనలోకి తీసుకోవడం లేదని వక్తలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే అన్ని సంఘాలు, సంస్థలు, మేథావులు, వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలిసి మేథోమథనం సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

"పంటల సమగ్రోత్పత్తి వ్యయానికి 50శాతం కల్పిస్తానని బీజేపీ బుట్టదాఖలు చేసింది. దీంతోపాటు ప్రతి సంవత్సరం 2కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఇలా ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారు." - అఖిలపక్ష నేతలు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.