కోటప్పకొండ వద్ద బొలెరో వాహనం బోల్తా, ఐదుగురికి గాయాలు
Road accident in Palnadu District : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోటప్పకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షత్రగాత్రుల వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన 12 మంది భక్తులు... కార్తీకమాసం కావడంతో.. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని తిరుగుపయనం అయ్యారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయం మార్గ మధ్యలో ఉంది. స్వామి దర్శనానికి వెళ్తుండగా.. మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో అయిదుగురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటిన కోటప్పకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం డ్త్రెవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలియజేశారు. ప్రయాణికులు ఎంత చెప్పున్న వినకుండా.. డ్త్రెవరు బొలెరో వాహనాన్ని అతి వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని వాళ్లు పేర్కొన్నారు.