Rare Fish Caught Fisherman Net in Sileru River : సీలేరు నదిలో మత్స్యకారుడి వలలో అరుదైన భారీ చేప

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 7:00 PM IST

thumbnail

Rare Fish Caught Fisherman Net in Sileru River : అల్లూరి జిల్లా సీలేరు నదిలోని గుంటవాడ జలాశయంలో మత్స్యకారుడి వలకు అరుదైన భారీ చేప చిక్కింది. దీనిని ఈ ప్రాంతంలో మిలట్రీ మోస్ లేక గెలిస్కోప్ అని పిలుస్తుంటారు. అయితే ఈ చేప శాస్త్రీయ నామం మషీర్. ఈ జాతి రకం చేప ఎక్కువగా శీతల ప్రదేశాల్లో కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నేపాల్​, భూటాన్​లో ఈ రకం చేపలు లభిస్తుంటాయి. ఈ అరుదైన చేపపై అనేక బృందాలు పరిశోధనలు చేశారు. ఎన్నో రకాల మందుల తయారీకి ఈ చేప నుంచి వచ్చే నూనెను ఉపయోగిస్తారని పరిశోధకులు చెప్తుంటారు.

అటువంటి అరుదైన చేప సీలేరు నదిలో ప్రత్యక్షమవడంతో దీనిని చూడడానికి పలువురు ఆసక్తి చూపారు. ఈ చేపను అత్తిలి వద్ద నుంచి స్థానిక బాలాజీ రెసి డెరెన్సీ యజమాని నక్కా జ్ఞానేశ్వరరావు కొనుగోలు చేశారు. ఈ రకం చేపలు జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో అరుదుగా లభిస్తుంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ రకం చేపలు ఐదు నుంచి 40 కిలోల వరకు సీలేరు నదిలో పెరుగుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.