ఎన్నికల ప్రక్రియ ఎందుకు అపహాస్యం పాలవుతోంది?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 10:13 PM IST

thumbnail

Prathidhwani: ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఎన్నికలు. అలాంటి ఎన్నికలే అప్రజాస్వామికంగా జరిగితే? గిట్టని వారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు లేకుండా తొలగిస్తే? దొంగ ఓట్లు యథేఛ్చగా వేస్తే? ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తే? అక్రమార్కుల గుండెల్లో నిద్రపోవాల్సిన ఎన్నికల సంఘం చూస్తూ వదిలేస్తే? ఊహించుకోవటానికే భయంగా ఉంది కదూ? అచ్చం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు సన్నగిల్లటంతో అడ్డదారుల్లో అధికారానికి ఎగబాకాలని వైకాపా ప్రయత్నిస్తోంది. టీఎన్ శేషన్‌ వంటి ఉద్దండులు పనిచేసిన ఎలక్షన్ కమిషన్‌ ఏం చేస్తోంది? ఎన్నికల ప్రక్రియ ఎందుకు అపహాస్యం పాలవుతోంది? ఆంధప్రదేశ్‌లో తమ ఓట్లు తమకి తెలియకుండానే తొలగిస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. పెద్ద యెత్తున తప్పుడు చిరునామాలతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ప్రతిపక్షలు గొంతు చించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఓటు హక్కు లేని యువత చాలామంది ఉన్నారు. వారందరూ ఓటు హక్కు పొందాలంటే యువత ఏం చేయాలి? ఎన్నికల సంఘం ఏం చేయాలి? పౌరసమాజం ఏం చేయాలి?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.