Prathidhwani: కలవర పెడుతున్న కరువు పరిస్థితులు... పట్టించుకోని ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 8:59 PM IST

thumbnail

Prathidhwani: నెర్రెలిచ్చిన పంటపొలాలు.. ఎండి వాడిపోతున్న వరిపైరు.. వడలిపోయిన రైతుల వదనాలు... ఇవీ రాష్ట్రవ్యాప్తంగా అనేకప్రాంతాల్లో కొద్దిరోజులుగా కనిపిస్తున్న దయనీయ దృశ్యాలు. గోదావరి, సాగర్‌, కృష్ణా ఆయకట్టులోనూ కరవు పరిస్థితులు కలవర పెడుతున్నాయి. మరోవైపు సాగుకు విడతల వారీగానే విద్యుత్‌ సరఫరా అందుతుండడం వల్ల విద్యుత్‌ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి రైతులను. మొత్తంగా ఖరీఫ్‌ కీలక సమయంలో వానలు కురవక రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు తీవ్రంగా ప్రభావితమవుతోంది. మరి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది? ఖరీఫ్‌ సీజన్‌లో 80 లక్షల ఎకరాల విస్తీర్ణానికి గానూ... అధికారికంగా సాగు అయిందే 55 లక్షల ఎకరాలు అంటున్నారు. ఈ కరవుపరిస్థితుల వల్ల వాటిల్లో ఎంతమేర నష్టం జరిగే ప్రమాదం ఉంది? పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కరవు మండలాలు ఎందుకు ప్రకటించలేదు. 300మండలాల్లో లోటువర్షపాతం అంటున్నారు. ఐనా కరవుమండలాలు ఎందుకు ప్రకటించలేదు? వ్యవసాయం గురించి, రైతుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏం చెప్పారు? సీఎం అయ్యాక ఏం చేశారు?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.