People Problems in Jagan Tour: సీఎం పర్యటన.. రహదారులు మూసివేయటంతో ప్రజల అవస్థలు.. సభ నుంచి వెనుదిరిగిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 4:51 PM IST

thumbnail

People Faced Problems in Jagan Emmiganuru Tour: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పట్టణంలోని రహదారులను మూసివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభ నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి మహిళలను బహిరంగ సభకు తరలించారు. బస్సులు బహిరంగ సభ వేదికకు దూరంగా నిలిపివేశారు. దీంతో నడుచుకుంటూ మహిళలు సభా ప్రాంగణం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా కొంతమంది మహిళలు సభ నుంచి వెనుదిరిగి వెళ్లారు. 

ఈ రోజు జిల్లాలోని ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్‌.. 'జగనన్న చేదోడు పథకం' నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో  ఎమ్మిగనూరు పట్టణంలోని చేనేత కాలనీలో ఉన్న వైఎంసీడబ్ల్యూ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక నుంచి 'జగనన్న చేదోడు పథకం' కింద ఎంపికైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.