Pawan Kalyan on Chittor Girl murder చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?: పవన్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 9:21 PM IST

thumbnail

Pawan Kalyan on Chittor Girl murder incident చిత్తూరు జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని భవ్యశ్రీ హత్య ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. విద్యార్థి హత్యపై స్పందించాల్సిన  బాధ్యత ప్రభుత్వానికి లేదా.. అంటూ  పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. బాలిక హత్యపై మహిళా కమిషన్‌, సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాలికల అదృశ్యంపై మాట్లాడితే మహిళా కమిషన్‌ హాహాకారాలు చేసిందని విమర్శించారు. ఇప్పుడు మహిళా కమిషన్‌.. బాలిక అదృశ్యంపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బాలిక తల్లిదండ్రుల ఆవేదన పరిగణలోకి తీసుకోరా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుందంటూ పవన్  ప్రశ్నించారు. 

 రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు  భారీగా నమోదవుతున్నాయని.. అయినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని పవన్ నిలదీశారు. కేసు తీవ్రతను తగ్గించేందుకే... పోలీసులు అనుమానాస్పద మృతి అంటున్నారని పవన్ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సైతం తనను కలచి వేసిందని పవన్ పేర్కొన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే... ఏపీలో  శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయే అర్థమవుతుందని విమర్శలు గుప్పించారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులను పాలకపక్షం కట్టేస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.