Officials Inspected Chekuru Quarries: చేకూరులో అక్రమ క్వారీలను పరిశీలనకు వచ్చిన అధికారులు.. కనీసం వాహనం కూడా దిగకపోవటంతో ఆగ్రహం!

By

Published : Aug 5, 2023, 4:23 PM IST

thumbnail

Officials Inspected Chekuru Quarries: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరులో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించేందుకు వచ్చిన అధికారులు కనీసం వాహనం కూడా దిగకపోవటంతో ఫిర్యాదు దారుడు, స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకూరు గ్రామానికి చెందిన అశోక్ చక్రవర్తి అనే యువకుడు.. తమ పరిసర గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెంటనే క్వారీలను నిలుపుదల చేసి ఏ మేర తవ్వారో కొలతలు వేయాలని సంబంధిత మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మైనింగ్ విజిలెన్స్ ఏడి శివాజీ తన బృందంతో కలిసి తొమ్మిది క్వారీలు పరిశీలించిన అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు రానందున నేనేమి చేయలేనని అక్కడి నుంచి వెనుదిగారు. దీంతో ఫిర్యాదు దారుడు, స్థానిక టీడీపీ నాయకులు వాహనాన్ని అడ్డగించి ఆయన్ను ప్రశ్నించారు. అధికారి చేసేదిలేక తహశీల్దార్ గోపాలకృష్ణకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తహశీల్దార్ సమాచార లోపంతోనే ఆలస్యం అయిందని మరో రోజు అధికారుల సమన్వయంతో అక్రమ క్వారీలను పరిశీలను చేస్తామని హామీ ఇవ్వటంతో సమస్య సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.