టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యం - ఆదివారం అర్ధరాత్రి వరకు కార్యాలయంలోనే అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 8:50 PM IST

thumbnail

Officers who Performed their Duties on Sunday : అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దార్​ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారులు విధుల్లో ఉన్నారన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సెలవు రోజైన, అధికారులు పొద్దుపోయే వరకు కార్యాలయంలోనే ఉన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఎల్వోలు ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు భాగస్వాములుగా ఉన్న అధికారులు అక్కడ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Officers who Performed their Duties on Sunday : టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికారులు, బీఎల్వోలతో సమావేశమైనట్లు విపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కొత్త ఓట్లు నమోదులోనూ అధికారులు పక్షపత వైఖరి ప్రదర్శస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సెలవు రోజు అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లో అధికారులు ఎందుకు ఉన్నారని సోషల్​ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆదివారం విధులు నిర్వర్తించడం ఏంటని మరికొందరు విమర్శిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.