ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడి - రాష్ట్రంలో జగన్ ఫ్యాక్షన్ పాలన : మునిరత్నంపై దాడిని ఖండించిన లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 11:25 AM IST

Updated : Nov 11, 2023, 8:03 AM IST

thumbnail

Nara lokesh react on YSRCP Leaders Attack on TDP Leader Munirathnam Naidu : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై అధికార పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి ( Chandrasekhar Reddy) అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నారా లోకేశ్ ట్విటర్(X) వేదికగా స్పందిస్తూ.. వైసీపీ నేతలు ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు. మునిరత్నం నాయుడుపై అధికార పార్టీ నేతల అనుచరులు దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిరత్నం పరిస్థితి విషమంగా ఉందన్న లోకేశ్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది : అచ్చెన్నాయుడు 

Atchannaidu Fires on YSRCP Attack on TDP Activists : మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతల దాడిని అచ్చెన్నాయుడు ఖండించారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికొదిలేశారని, ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనకడుగు వేయదని తెలిపారు. దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Last Updated : Nov 11, 2023, 8:03 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.