ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 1:22 PM IST

thumbnail

Nara Lokesh Fire on YSRCP Government : ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌కు 6 నెలలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారు 1000 కోట్ల బకాయిలు పెట్టినందున,  వైద్య సేవలు నిలిపేస్తామని ఏపీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ లేఖ (AP Super Speciality Hospital Association Letter) రాయడం, రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జగన్  చేతగాని పాలనతో రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Govt Not Allocating Funds for Arogyasree Scheme : కరోనా సమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందించట్లేదని బోర్డులు పెట్టినపుడే జగన్ పనితనం ఏంటో ప్రజలకు అర్థమైందని  లోకేశ్ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ A ప్లస్‌గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ B ప్లస్‌కు దిగజార్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్ చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.