'నా చావుకు ఆమే కారణం' - ఆత్మహత్యకు ముందు పారిశుద్ధ్య కార్మికుడి సెల్ఫీ వీడియో

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 10, 2024, 4:55 PM IST

thumbnail

Municipal Worker Suicide Selfie Falling Under Train: నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లె వద్ద రైలు కిందపడి పారిశుద్ధ్య కార్మికుడు హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు హరికృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వైసీపీ నాయకురాలు వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరికృష్ణ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. నంద్యాల తోటలైన్​కు చెందిన హరికృష్ణ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడుగా పని చేస్తున్నాడు. అతను హరిజనపేటకు చెందిన వైసీపీ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ కన్నాంబ వద్ద అధిక వడ్డీకి డబ్బులను అప్పుగా తీసుకున్నాడు. 

పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా జీతాలు రాక వడ్డీ చెల్లించలేకపోయాడు. కొద్ది రోజులు ఆగాలని హరికృష్ణ ఎంత చెప్పినా వినకుండా కన్నాంబ అప్పు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరికృష్ణ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అప్పు చెల్లించాలని ఆమె బెదిరించడంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతను రైలు కిందపడి ప్రాణాలు విడిచాడు. హరికృష్ణ తన పిల్లలకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.