వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోవాలి - టీడీపీ-జనసేన రావాలి: బాలకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 3:21 PM IST

thumbnail

MLA Balakrishna Tour in Hindupuram : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని జనసైనికులకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు అనే దివ్యాంగుడి వద్దకు ఆయన వెళ్లి మోకాళ్లపై కూర్చుని ఆప్యాయంగా భుజం తట్టి మాట్లాడారు అలగే  పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని బాలకృష్ణ నివాసంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా బాలకృష్ణను జనసేన నాయకులు, కార్యకర్తలు కలిశారు. బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు గెలిపించాలని  పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

మోకాళ్లపై కూర్చోని పలకరింపు : బాలకృష్ణ హిందూపురం వస్తున్నాడని తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు అనే దివ్యాంగుడు, ఆయనకు తన కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి అక్కడకు చేరుకున్నారు. బాలకృష్ణ రామాంజనేయులను ఆప్యాయంగా పలకించారు. ఈ క్రమంలో బాలకృష్ణకు రామాంజనేయుల శాలువా కప్పేందుకు ప్రయత్నం చేయగా బాలయ్య మోకాళ్లపై కూర్చోని స్వీకరించారు. అనంతరం ఆప్యాయంగా భుజం తట్టి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జనసైనికులకు, అభిమానులకు ఆయన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్సీపీ అరాచక పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లండి : హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బాలకృష్ణ పార్టీ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి టీడీపీ నేతలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ అరాచక పాలన గురించి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. హిందూపురం పట్టణానికి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమీక్ష సమావేశాలకు వచ్చిన నాయకులను, కార్యకర్తలను బాలయ్య ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.