వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతికి దూరమయ్యారు: మన్నవ మోహన కృష్ణ

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 14, 2024, 6:19 AM IST

thumbnail

Mannava Mohana Krishna Distributed Chandranna Kanuka to People: వైసీపీ హయాంలో పేదలు సంక్రాంతి పండగను కూడా సంతోషంగా జరపుకోలేని దుస్థితి నెలకొందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందన్న కానుకను వైసీపీ ప్రభుత్వం ఆపివేసినందున పేదలు ఇబ్బందిపడకుండా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలాగైతే పేదలకు చంద్రన్న కానుక అందజేశారో ఆయన స్పూర్తితో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పండగకు మన్నవ మోహనకృష్ణ చారిటబుల్​ ట్రస్​ ద్వారా చంద్రన్న పేరుతో ఇస్తున్నామని అన్నారు. కాని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను తీసేశారు. అయినా సరె మా సొంత ఖర్చుతో పేదలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల చంద్రబాబు పేరు ప్రజలలోకి వెళ్తుందని జగన్ పోలీసుల ద్వారా అడ్డుకుంలు సృష్టిస్తున్నారని అన్నారు. మన్నవ మోహనకృష్ణ ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రన్న కానుక అందిస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.