పెద్ద శేష వాహనం పై మలయప్ప స్వామి వారి దర్శనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 12:17 PM IST

thumbnail

Malayappa Swami Peda Sesha Vahana Seva in Tirumala : తిరుమలలో(tirupathi) నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగుల చవితిని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద  శేష వాహనం పై ఉభయ దేవేరులతో కలిసి శుక్రవారం రాత్రి భక్తులకు దర్శన మిచ్చారు. ప్రతి ఏడాది నాగుల చవితి రోజున శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Malayappa Swami darshanam due to nagulachavithi : తిరుమలలో స్వామి వారి  శేష వాహన సేవ రాత్రి 7  నుంచి 8 గంటల మధ్య  వైభవంగా సాగింది. మలయప్ప స్వామి వారు ఏడు పడగల ఆది శేషుడి పై  తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో భక్తులు  భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈ జగన్మోహన్ రెడ్డి, టెంపుల్ పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.