Mahasena Rajesh Cake Cutting on CM Jagan Bail: సీఎం జగన్‌ బెయిల్​కు పదేళ్లు.. మహాసేన రాజేశ్​ వినూత్న కార్యక్రమం..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 10:54 AM IST

thumbnail

Mahasena Rajesh Cake Cutting on CM Jagan Bail: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్‌ బెయిల్​పై విడుదలై పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్​ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్‌పై 38 కేసులు ఉన్నాయని.. ఆ కేసుల వివరాలతో 38 కేకులను అమర్చి వాటిని పార్టీ శ్రేణుల సమక్షంలో కోశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా 2 లక్షల 14 వేల మందికి శిక్షణ ఇచ్చి.. 74 వేల మందికి ఉపాధి కల్పిస్తే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబుది అభివృద్ధి అని.. జగన్​మోహన్​ రెడ్డిది అరాచకమని మహాసేన రాజేశ్​ అన్నారు.

చంద్రబాబుకు నిర్మించడం, అభివృద్ధి చేయడం తెలిస్తే జగన్​మోహన్​ రెడ్డికి కూల్చివేయడమే తెలుసన్నారు. జగన్​మోహనరెడ్డిపై 38 కేసులు ఉన్నాయని.. చంద్రబాబుపై ఒకే ఒక్క తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో గృహ నిర్మాణాలు, టిడ్కో ఇళ్లు నిర్మిస్తే.. జగన్​మోహన్​ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత.. రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. అన్నా క్యాంటీన్​ల ద్వారా పేదల అకలి తీర్చిన మహానుభావుడు చంద్రబాబును.. ప్రజలు దీవిస్తారని వాటిని కూల్చేసిన ఘనత సీఎం జగన్​దని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.