ప్రమాదం చేసి.. కాలవలోకి దూకి.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లారీ డ్రైవర్ !
Lorry Driver Jumped Into The Canal: ఓ డ్రైవర్.. పోలీసులకు చిక్కకుండా పరారయ్యేందుకు చేయని ప్రయత్నమే లేదు. ఈ డ్రైవర్‌ను కేవలం పోలీసులు మాత్రమే కాదు.. స్థానికులు, ఇతర వాహనదారులు కూడా వెంబడించారు. గజ ఈతగాళ్లను సైతం కిలోమీటర్ల దూరం ఈతకొట్టేలా చేశాడు. ఇంతకీ ఈ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద.. ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో టిప్పర్‌ను నడిపి వాహనాలను ఢీ కొట్టాడు. స్థానికులు, ఇతర వాహనదారులు అతడిని వెంబడించడంతో.. ఆగకుంటా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించి.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. టిప్పర్‌తో సహా సంగం బ్యారేజీ వైపు దూసుకెళ్లాడు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే సంగంలో కాపుకాయడంతో.. వెంటనే టిప్పర్‌ను సంగం బ్యారేజీ సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ గట్టుపై టిప్పర్ ఆపేసి.. వెంటనే కాలువలోకి దూకేశాడు. ఇలా కాలువలో ఈత కొట్టుకుంటూ పరారవ్వాలనుకున్నాడు. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యి.. గజ ఈతగాడి సాయంతో పట్టుకోవాలనుకున్నారు. ఇలా కిలోమీటర్ దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.