'J' Gun Flower Decoration: 'దేవుని సన్నిధిలో 'గన్' సంస్కృతి ఏంటి..?'

By

Published : May 16, 2023, 7:11 PM IST

Updated : May 16, 2023, 10:01 PM IST

thumbnail

Lokesh Tweet On  'J' Gun Flower Decoration: తిరుపతి గంగమ్మ గుడి వద్ద అలంకారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటనీ నిలదీశారు. వైసీపీ జెండా గుర్తులకు, 'J' అక్షరానికి, గంగమ్మకి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రచార పిచ్చితో, అహంకారంతో ఇలాంటి వేషాలు వేస్తోందని మండిపడ్డారు. దైవ‌స‌న్నిధిలోనూ జ‌గ‌న్ గ్యాంగ్‌ త‌మ నేర‌బుద్ధిని చూపించుకున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. జ‌గ‌న్ పేరు వ‌చ్చేలా J అక్షరం, గ‌న్ బొమ్మలొచ్చేలా పూల‌తో అలంక‌రించ‌డం చూస్తే, ఎంత‌గా బ‌రి తెగించారో తేట‌తెల్లమ‌వుతోందన్నారు. ప్రజ‌ల్నేకాదు, దేవుళ్లనీ బెదిరిస్తున్నట్టేనని ఎద్దేవా చేశారు. ఆలయ అలంకరణలో భక్తులకు గన్ చూపించి వైసీపీ ఏం సందేశం ఇస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. J అక్షరం జె-బ్రాండ్ మద్యం గురించా లేక జగన్‌ వసూలు చేసే J టాక్స్ కమిషన్ గురించా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ట్వీట్: తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటి ? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా? 

లోకేశ్ ట్వీట్: దైవ‌స‌న్నిధిలోనూ జ‌గ‌న్ గ్యాంగులు త‌మ నేర‌బుద్ధిని చూపించుకుంటున్నాయి. తిరుపతి గంగమ్మ గుడి ఆవరణలో జ‌గ‌న్ పేరు వ‌చ్చేలా జె అక్ష‌రం, గ‌న్ బొమ్మ‌లొచ్చేలా పూల‌తో అలంక‌రించ‌డం చూస్తే, ఎంత‌గా బ‌రి తెగించారో తేట‌తెల్లమ‌వుతోంది. దేవాల‌యాల‌పై గ‌న్ బొమ్మ‌లు వేస్తున్నారంటే, ప్ర‌జ‌ల్నేకాదు, దేవుళ్ల‌నీ బెదిరిస్తున్న‌ట్టే.

అచ్చెన్నాయుడు ట్వీట్:  గుడి దగ్గర గన్ ఏంటి... సైకోలు కాకపోతే! భక్తులకు గన్ చూపించి వైసీపీ క్రిమినల్ బ్రెయిన్స్ ఏం సందేశం ఇస్తున్నాయి? J అక్షరం ఏంటి? జె-బ్రాండ్ మద్యం గురించా? మీ వోడు వసూలు చేసే J టాక్స్ గురించా? కమిషన్ గురించా? ఆ పార్టీ జెండాలు ఏంటి? అసలు తిరుపతి గంగమ్మ ఆలయానికి ఈ డెకరేషన్ కి

Last Updated : May 16, 2023, 10:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.