జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 4:24 PM IST

thumbnail

Lokesh Condemned Attack on Dalit Youth: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలి కాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్​ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసల పెట్టడమేగాక.. దాహంవేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి జగన్​కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం.. జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.