చంద్రబాబుకు నాపై పూర్తి విశ్వాసం ఉంది : బోడె ప్రసాద్​

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 13, 2024, 10:16 AM IST

thumbnail

Latest Political Consequences in Penamalur Constituency : పెనమలూరు నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల తానేం అధైర్య పడట్లేదని తెలుగుదేశం ఇన్​ఛార్జ్​ బోడె ప్రసాద్​ స్పష్టం చేశారు. ఈ నెల 18న చంద్రబాబు అధ్యక్షతన గుడివాడలో నిర్వహించే ఎన్టీఆర్​ వర్ధంతి కార్యక్రమం సన్నాహక సమావేశంలో పాల్లొంటానని తెలియజేశారు. చంద్రబాబుకు తనపై పూర్తి విశ్వాసం ఉందని బోడె ప్రసాద్​ వ్యాఖ్యానించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. అవసరం అయితే కార్యకర్తల తరపున పోరాటం చేస్తానే కానీ ఎక్కడా రాజీపడానికి సిద్ధంగా లేను అని పేర్కొన్నారు.

Bode Prasad Comments : పెనమలూరులో పోటీకి సిద్ధమైన మంత్రి జోగి రమేష్​ అడ్రస్​ ఎక్కడా అని బోడె ప్రసాద్​ ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడికి కుక్కకాటుకు చెప్పు దెబ్బలా తెలుగుదేశం ఏంటో చూపిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అడ్రస్​ లేని వ్యక్తికి పెనమలూరు నియోజక వర్గంలో స్థానం లేదని అందరికి తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.